Natyam ad

అమ్మో…పులి

-బయిటకు రావడానికి భయపడుతున్న జనాలు

అదిలాబాద్ ముచ్చట్లు:


జిల్లాలో వరుసగా సంచరిస్తోన్న పులులు సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా పులులు సంచరిస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. అడవుల్లో వన్యప్రాణులను వేటాడడం తో పాటు రైతుల పశువుల పై దాడులు చేసి హతమారుస్తున్నాయి. దీంతో పెన్ గంగా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలకు క్షణక్షణం భయం భయం గా మారింది.ఆదిలాబాద్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలో తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం ఉంది. ఈ పర్యాటక కేంద్రానికి ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు వస్తూ ఉంటారు. సందర్శకుల తాకిడి, పులులకు సరిపడా ఆహారం లభించకపోవడం మూలంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు జిల్లాలోని అడవుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇటీవల జైనథ్ మండలం హత్తి ఘాటు వద్ద నిర్మిస్తున్న కెనాల్‌లో రెండు పులులు సంచరించిన ఘటన మరవకముందే శనివారం భీంపురం మండలం గొల్లగట్టు తాంసి దగ్గర నాలుగు పులులు కనిపించాయి.రిజర్వాయర్ సిబ్బంది ఆదిలాబాద్ నుంచి క్యాంపుకు వెళ్తుండగా నాలుగు పులులు రోడ్డుపై సంచరించడం గుర్తించి సెల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

 

Post Midle

ప్రస్తుతం ఈ వీడియో లు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. పులులను అన్వేషించడానికి గాలింపు చర్యలు చేపట్టారు. వలస వచ్చిన పులులు ఎక్కువ కాలం జిల్లాలో ఉండవని తిరిగి అభయారణ్యానికి వెళ్తాయని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లొద్దని, గుంపులు గుంపులుగా భారీ శబ్దాలు చేస్తూ వెళ్లాలని సూచించారు. కాగా, పంట చేతికి అంది వచ్చే సమయం కావడం, ఎటు నుంచి పులి వస్తుందో తెలియక, రైతులు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. నెల రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

 

Tags: Um…tiger

Post Midle

Leave A Reply

Your email address will not be published.