Natyam ad

నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు

ఏలూరు ముచ్చట్లు:

నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జాయింట్ ఐజి తిమ్మాపురం సరోజ ఆకస్మికంగా తనిఖీ చేసారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జాప్యం, అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ నిమిత్తం తనిఖీలు జరిపినట్లు  జాయింట్ ఐజి వెల్లడించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతో రిజిస్ట్రేషన్లు ప్రక్రియలో జాప్యం జరుగుతుందని, త్వరలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్న ఆమె అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగులు, ఏజెంట్ల హవాపై ప్రశ్నించగా ఆరోపణలు చేయటం సరికాదని నేరుగా ఫిర్యాదు చేస్తే అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం వల్ల పని భారం తగ్గుతుందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందన్న జాయింట్ ఐజి సరోజ అన్నారు.

 

Tags: Unannounced inspections at Nujiveedu Sub-Registrar Office

Post Midle
Post Midle