అనధికార బెల్టు షాపులు వెంటనే మూసివేయాలి:ఈసి ఆదేశం

Date:26/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

జి హెచ్ యం సి ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా నిల్వలు మరియు మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్ధసారధి అన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజు శాఖ కమీషనర్ మరియు ఉన్నతాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ అనధికార మద్యం దుకాణాలు (బెల్టు షాపులు) వెంటనే మూసివేయాలని, గత సంవత్సరం ప్రస్తుత సమయంలో జరిగిన మద్యం ఉత్పత్తులు, అమ్మకాలతో బేరీజు వేస్తూ పర్యవేక్షించాలన్నారు. నల్ల బెల్లం మరియు అక్రమ మద్యం ఉత్పత్తికి వాడే ముడి సరుకులను సీజ్ చేయాలన్నారు. అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి చెక్ పోస్టులు ప్రారంభించాలన్నారు. 29 వ తేదీ సా. 6.00 గం. ల నుండి 1 వ తేది పోలింగ్ ముగిసే వరకు జి హెచ్ యం సి పరిధిలో  మద్యం షాపులు మూసి వేయించాలన్నారు. మద్యం దుకాణాలు కౌంటింగ్ తేదీ(4.12.2020) రోజున జి హెచ్ యం సి పరిధిలో మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలి. మద్యం దుకాణాలలో మద్యం నిల్వలు అనుమతించిన పరిమాణం దాటకుండా చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరుపుతూ ఉండాలన్నారు.ఈ సమావేశానికి ఎక్సైజు కమీషనర్ సర్ఫరాజ్  అహ్మద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కమీషనర్ అజయ్, డిప్యూటీ కమీషనర్  సయ్యద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags; Unauthorized belt shops should be closed immediately: Easy command

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *