Natyam ad

అనుమతి లేని కోర్సులను రద్దు చేయాలి

– విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించిన నారాయణ యాజమాన్యం
-ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక విద్యార్థులు..ఫర్నిచర్ ధ్వంసం

అనంతపురం ముచ్చట్లు:

అనుమతి లేదు కోర్సుల పేరిట  నారాయణ విద్యాసంస్థలు సాగిస్తున్న ఫీజు దోపిడీని అరికట్టాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఓబులేసు, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీలు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు  నారాయణ విద్యాసంస్థల ఎదుట  ఆందోళన చేశారు. గురువారం స్థానిక సోమల దొడ్డి నారాయణ కళాశాల వద్ద స్థానిక విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేపట్టగా.. విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. తమ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల యాజమాన్య ప్రతినిధుల ప్రవర్తనను జీర్ణించుకోలేని స్థానిక విద్యార్థులు అసభ్య పదజాలంతో దూషించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నారాయణ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా  పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరకట్టే వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థి నేతల స్పష్టం చేశారు.

 

Post Midle

Tags: Unauthorized courses should be cancelled

Post Midle

Leave A Reply

Your email address will not be published.