రాజీలేని పోరాటం : సీఎం చంద్రబాబు

Uncompromising fight: CM Chandrababu

Uncompromising fight: CM Chandrababu

Date:15/02/2018
అమరావతి ముచ్చట్లు:
కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు జరిపినట్లే ఏపీకి కేటాయింపులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం నాడు అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మన హక్కుల సాధన కోసమే రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ, అనవసరంగా ఒకరిని నిందించం అని పేర్కొన్నారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామన్నారు.  పోలవరంపై అసెంబ్లీలో చర్చ పెడతానంటే అమిత్ షా, జైట్లీలు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని గుర్తు చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఇబ్బందులు పడుతుంటే… పనులు త్వరగా కావాలని మరో కాంట్రాక్టర్ను తీసుకొచ్చామని బాబు తెలిపారు. గతంలో ఫేజ్-1 డీపీఆర్, తాజాగా రివైజ్జ్ డీపీఆర్ పంపామని చెప్పారు. అవరోధాలు తొలిగి ఇప్పుడు ప్రాజెక్టు దారిలో పడిందని సమావేశంలో బాబు అన్నారు.అలాగే,   గల్ఫ్, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రతిపక్షాల దుష్పప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేతలతో ముఖ్యమంత్రి అన్నారు. గల్ఫ్, అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.  విదేశీ పర్యటన ఫలితంగా 50 కంపెనీల నుంచి రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో చంద్రబాబు బీజేపీపై కుడా మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందన్న విషయమై లెక్కలు తీసి చూపాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేంద్రం ఏం చేసిందనే అంశంపై బీజేపీయే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎంత మంజూరు చేశారో ఇప్పటివరకూ చెప్పనేలేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీజేపీ లెక్కలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు.
Tags: Uncompromising fight: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *