Unconstitutional - Citizenship Amendment Act

రాజ్యాంగ విరుద్ధం – పౌరసత్వ సవరణ చట్టం

– 9వ రోజు కొనసాగిన దీక్షలు

Date:19/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తోందని ముస్లిం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణమరెడ్డిపల్లె రోడ్డులో గల మసీదు ముతవల్లి హాఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లింలు తొమ్మిదవ రోజు రిలే దీక్షలను పట్టణంలోని ఇందిరాసర్కిల్‌లో కొనసాగించారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయండి…ఎన్‌ఆర్‌సీ,సీఐఏ, ఎన్‌ఆర్‌పీ రద్దుపరచండి…. రాజ్యాంగాన్ని కాపాడండి….మతం పేరుతో దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. దీక్షా శిబిరంలో హాఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపీ ప్రభుత్వం పథకం ప్రకారం ముస్లింలను ఇబ్బందులకు గురి చేస్తోందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యదేశంలో పౌరసత్వంపై సవరణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కులమతాలకు విఘాతం కలిగించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని , లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tags: Unconstitutional – Citizenship Amendment Act

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *