కేసీఆర్ తో ఉండవల్లి  భేటీ

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్   భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీరి భేటీ  సరికొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపో, మాపో పార్టీ ప్రకటన కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాలపై అవగాహన ఉన్న ఉండవల్లితో జాతీయ పార్టీపై చర్చించేందుకే ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్ల తెలుస్తోంది. కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలుంటాయి? ఏయే పార్టీలు కలిసొస్తాయి అన్న దానిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న సీఎం కేసీఆర్, ఏపీ బాధ్యతలను ఉండవల్లికి అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలపై చర్చ! కాగా ఈ భేటీకి ముందే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో మరోసారి సమావేశమయ్యారు కేసీఆర్‌. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చ విస్తృతంగా చర్చలు జరిగినట్టు సమాచారం. పార్టీ ఏర్పాటు తర్వాత పరిణామాలు, పర్యవసానాలు, రోడ్‌ మ్యాప్‌ తదితర విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అభ్యర్థుల కూర్పు ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా మరో రెండు రోజులు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.

 

Tags: Undavalli meeting with KCR

Post Midle
Post Midle
Natyam ad