Undemocratic laws in India

భారతదేశంలో అప్రజాస్వామిక చట్టాలు

– 13వ రోజు కొనసాగిన దీక్షలు
– ఒంటికాలుపై ప్రదర్శన

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

భారతదేశంలో అప్రజాస్వామిక చట్టాలు చేసి మతాలను అణచివేస్తున్నారని ముస్లింలు ఆరోపిస్తూ 13వ రోజు నిరాహరదీక్షలు కొనసాగించారు. గురువారం పట్టణంలోని సనా కాంపౌండు అక్సామసీదు ముతవల్లి సాదీక్‌ ఆధ్వర్యంలో ముస్లింలు దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డులలో పౌరసత్వ సవరణ చట్టం వద్దు… ఎన్‌ఆర్‌సీ, సీఐఏ, ఎన్‌ఆర్‌పీ రద్దుపరచండి….కొత్తచట్టాలను బహిష్కరిస్తాం…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముతవల్లి సాదీక్‌ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు నివాసంతో పాటు జీవించే హక్కు ఉందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వీటిని కాలరాచి, కొత్త చట్టాలతో మతాలను అంతమోందించేలా చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే కేంద్రం సవరణ చట్టాన్ని రద్దు చేయాలని , లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ మోటారుసైకిల్‌ ర్యాలీ

Tags: Undemocratic laws in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *