Under disaster, the poor need to be supported

విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలి

-చిటికెల సలోమి.
-పేదలకు వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ

Date:04/04/2020

కర్నూలు ముచ్చట్లు:

 

విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు అండగా నిలవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని డీఆర్డీఏ విజిలెన్స్ &మానిటరింగ్ సభ్యురాలు చిటికెల సలోమి అన్నారు. శనివారం నగరంలోని 86 వ వార్డులోని మహాలక్ష్మి నగర్లో పేదలకు వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లను చిటికెల సలోమి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి భారిన పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

 

 

ప్రభుత్వం,జిల్లా అధికారులు చెప్పే సూచనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. లాక్ డౌన్ కారణంగా పేదప్రజలు పనులు లేక పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయని, అలాంటి వారికీ కనీసం ఒక్క పూట కడుపు నింపాలనే వారికీ గత 4రోజుల నుండి తాను భోజనం ప్యాకెట్లు, పులిహోర, వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లు, అరటిపండు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.

పుంగనూరులో సేవా కార్యక్రమాలు

Tags: Under disaster, the poor need to be supported

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *