Natyam ad

మన ప్రభుత్వంలో గిరిజనులకు ప్రపంచంతో పోటీపడే విద్యావకాశాలు.. సీఎం జగన్

విజయ నగరం ముచ్చట్ల:

*ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన వర్సిటీకి కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌*

Post Midle

*సాలూరులో రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు*

*ఈ వర్సిటీతో గిరిపుత్రుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు*

*నాలుగేళ్ల మన పాలనలో విద్య వైద్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం.. సీఎం జగన్*

“గిరిజనుల మిత్రుడిగా, పక్షపాతిగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాలూరులో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ విశ్వ విద్యాలయం రూపుదిద్దుకుంటుంది..గిరిజన ప్రాంతానికి ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది,ఒక్క గిరిజన ప్రాంతంలోనే రెండు మెడికల్ కాలేజీలు, ఒక ట్రైబల్ యూనివర్సీటీ, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తున్నాయి. నాడు- నేడుతో విప్లవాత్మక మార్పుతో గిరిజన విద్యకు కని, విని ఎరుగని రీతిలో మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి”- సీఎం జగన్

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. సాలూరులో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో, 561.88 ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్, సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయించడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూములిచ్చిన రైతులకు రూ.25.90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు.

*ఉత్తరాంధ్రకు కిరీటంగా సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ*

కేంద్రీయ ట్రైబల్ యూనివర్సీటీ ఉత్తరాంధ్రకు కిరీటంగా నిలుస్తుందని, మన ప్రాంతం ఉన్నత చదువులకు నెలవుగా మారుతోందని సీఎం జగన్ పేర్కోన్నారు. గత టీడీపీ ప్రభుత్వం విభజన హామీలో భాగమైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటును గాలికొదిలేస్తే, మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత అనుకూల పరిస్థితులు ఉండేలా విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉండేలా, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీప ప్రాంతలో యూనివర్సిటీకి భూకేటాయింపులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే వర్సిటీకి అవసరమైన భూమి, విద్యుత్, నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చినట్లు వివరించారు. దీంతో పాటు వర్సిటీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్, బి.కామ్ లో ఒకేషనల్ తదితర 14 అకాడమిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, స్కిల్ డెవలప్ మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోందన్నారు. 2019 నుంచి విజయనగరం జిల్లా కొండకారకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ పాత క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీలో 385 మంది విద్యార్థులు ఉన్నారు.

*గిరిపుత్రుల జీవితాల్లో విద్యా కాంతులు*

మన గిరిపుత్రులు రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ ప్రాంతాంలో ఎటు చూసిన కొత్త కాలేజీలు, యూనివర్సీటీలు కనిపిస్తున్నాయని గిరిపుత్రుల జీవీతాల్లో విద్యా కాంతులు వెలుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల మన పాలనలో వైద్యా, విద్యకి ప్రాధాన్యత ఇచ్చామని వాటికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టామని సీఎం జగన్ వివరించారు.

*1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాల భూములు*

వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం సమున్నత చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమం కోసం మన ప్రభుత్వం రూ. 16, 805.77 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2 ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి పోర్టల్ ద్వారా డిజిటలైజేషన్ చేసి 1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాలను అన్ని హక్కులతో కూడిన RoFR పత్రాలు పంపిణీ చేసినట్లు వివరించారు. 4.58 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019 నుంచి రూ. 410.11 కోట్ల ఖర్చుతో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. పార్వతీపురం, పాడేరులో రూ.1000 కోట్లతో మెడికల్ కాలేజీలు, 300 మెడికల్ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్దపీట వస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ. 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 105.32 ఎకరాల్లో రూ.153.85 కోట్లతో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల, 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

Tags:Under our government, tribals have educational opportunities to compete with the world.. CM Jagan

Post Midle