కరీంనగంలో అండర్ గ్రౌండ్ డస్ట్ బిన్స్

Underground Dust Bins in Karimnama

Underground Dust Bins in Karimnama

Date:09/11/2019

కరీంనగర్ ముచ్చట్లు:

కరీంనగర్‌ నగరంలోని అనేక ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నది. ప్రస్తుతం రోడ్లపై ఏర్పాటు చేసిన డంపర్ బిన్స్ వల్ల వస్తున్న సమస్యలు, ట్రాక్టర్లు, బ్లేజర్ ద్వారా తరలింపులో వస్తున్న ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్‌కు 2.50 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు మొదటి దశలోనే 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బస్టాండ్ వెనుక, ప్రభుత్వ దవాఖాన వెనుక, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల సమీపం, అన్నపూర్ణ కాంప్లెక్స్, శనివారం మార్కెట్, మహిళా డిగ్రీ కళాశాల, మార్కెట్ రిజర్వాయర్, తెలంగాణ చౌక్, ఆదర్శనగర్, సాయినగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావించారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వ దవాఖాన వెనుక రోడ్డులో ఈ బిన్స్ బిగించే పనులు పూర్తి చేశారు. త్వరలోనే వీటిని ప్రారంభిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు బస్టాండ్ వెనుక ఉన్న రోడ్డు పక్కన త్వరలో ఏర్పాటు పనులు చేపట్టనున్నారు. వీటి పనితీరు అనంతరం ఎంపిక చేసిన మిగిలిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి.అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటులోనూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ రెండు బిన్స్ పెడుతున్నారు. చెత్త వేర్వేరుగా వేసే విధంగా గుర్తులు కూడా పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా బిన్స్‌కు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. జీఐఎస్, సెన్సార్ బిగించనున్నారు. బిన్స్‌లో చెత్త నిండితే సెన్సార్ వల్ల సంబంధిత సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. ఆ వెంటనే చెత్తను తీసుకెళ్తారు.ప్రస్తుతం రోడ్లపై ఏర్పాటు చేస్తున్న డంపర్ బిన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు అండర్ గ్రౌండ్‌లో బిన్స్ ఏర్పాటు వల్ల తొలిగిపోనున్నాయి. దుర్వాసన వచ్చే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. జంతువులు చేరి చెత్తను చెల్లాచెదారం చేసే అవకాశం ఉండదు. రోడ్లపక్కను చెత్త పేరుకుపోయే వీలుండదు. తద్వారా రహదారులు పరిశుభ్రంగా కనబడుతాయి.

 

మార్కెట్‌ కు తెచ్చుకోవాలంటే రైతులు భయపడుతున్నారు

 

Tags:Underground Dust Bins in Karimnama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *