Date:21/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి, యువకులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ కోరారు. గురువారం ఆయన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కమిషనర్ కెఎల్.వర్మ , ఎంపీడీవో లక్ష్మీపతినాయుడుతో కలసి జాబ్‌మేళా నిర్వాహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నియోజకవర్గంలోని నిరుద్యోగులైన యువతి, యువకులకు అర్హతను బట్టి ఉద్యోగాల్లో నియమించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. చెన్నై, బెంగళూరుతో పాటు మన రాష్ట్రంలోని 22 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. సుమారు 2500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుండగా ఈ ఉద్యోగాల కోసం 7100 మంది ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈయన వెంట మంత్రి పిఏ మునితుకారాం, తహశీల్ధార్ వెంకట్రాయులు, సీఐ గంగిరెడ్డి, డీఈఈ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు….
జాబ్‌మేళాకు హాజరైయ్యే నిరుద్యోగులకు అన్ని విధాల సహాయం అందించేందుకు హెల్ఫ్డెస్క్లు ఏర్పాటు చేశామని జేసి రాజశేఖర్ తెలిపారు. అలాగే ప్రతి హెల్ఫ్ డెస్క్ వద్ద వలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను నియమించి, నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండ కంపెనీల వారిగా సమాచారం అందిస్తామన్నారు. నిరుద్యోగులకు భోజనం,మంచినీటి వసతి ఏర్పాటు చేశామన్నారు.అలాగే ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండ చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులందరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జేసి కోరారు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Unemployed in Punganur should take advantage of job fair – Jesse Rajasekhar