నిరుద్యోగ భృతి 3,500

Date:19/06/2019

జైపూర్ ముచ్చట్లు:

నిరుద్యోగ భృతి అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. కొందరేమో దీనికి మద్దతు తెలిపితే.. మరికొందరేమో పెదవి విరుస్తున్నారు. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం నిరుద్యోగ భృతి అందించారు. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం కూడా చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నట్లుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అందించేందుకు సిద్ధమౌతోంది. గ్రాడ్యుయేషన్ లేదా దీనికి సమానవైన డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి రూ.3,500 అందించనుంది. ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన పథకం కింద అర్హులైన వారికి నిరుద్యోగ భృతి అందనుంది. ఫిబ్రవరి నుంచి స్కీమ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాజస్థాన్‌కు చెందిన వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పథకం కింద మహిళా నిరుద్యోగులకు నెలకు రూ.3,500 లభిస్తుంది. అదే నిరుద్యోగులు మగవారు అయితే నెలకు రూ.3,000 ఇస్తారు. నిరుద్యోగ భృతి రెండేళ్ల వరకు ఇస్తారు. ఇకపోతే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగించడం లేదు.

 

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

Tags: Unemployment rate is 3,500

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *