Natyam ad

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఊహించని అభివృద్ధి -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించని అభివృద్ధి జరుగుతోందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన పట్టణంలో మంత్రి పెద్దిరె డ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబిటి రోడ్డు, గాంధినగర్‌, బాలాజి  థియెటర్‌ రోడ్డు, తూర్పువెహోగశాల ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేశారు. చైర్నన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. పేద ప్రజలకు పక్కాగృహాలు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీప్‌ఫండ్‌, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ చేయూత లాంటి పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధిచేకూరిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా జిల్లా కోఆర్డినేటర్‌ నవీన్‌కుమార్‌రాజు, కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, కాంతమ్మ, పూలత్యాగరాజు, సాజిదాబేగం, అర్షద్‌అలి, అమ్ము, , భారతి, నరసింహులు, కాళిదాసు, ఆదిలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌, కుమార్‌, లక్ష్మణ్‌రాజు, కిషోర్‌, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Unexpected development when YSRCP came to power – Chairman Aleem Basha

Post Midle