కరోనా ల్యాబ్‌లోనే పుట్టిందన్న చైనా శాస్త్రవేత్తకు ఊహించని షాక్!

Date:17/09/2020

న్యూ ఢీ్లీ  ముచ్చట్లు

కరోనా పుట్టిల్లు ఏదీ అంటే ఠక్కున వినిపించే జవాబు.. చైనా..!  చైనాలో అడవి జంతువులను అమ్మే వెట్ మార్కెట్‌లో కరోనా పుట్టిందా లేక చైనా పరిశోధన శాలలో కళ్లు తెరిచిందా అనేవి ఈ మిస్టరీతో ముడిపడున్న ఇతర ప్రశ్నలు. అది చైనా.. కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబులు, ఆధారాలు కూడా దొరకడం కష్టమే!ఇటువంటి సమయంలో చైనాకు చెందిన మహిళా శాస్త్రవేత్త లీ మెంగ్ యాన్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ మా వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందంటూ కలకలం రేపారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఆ విషయం బయటపెట్టాకు..భద్రతా కారణాల రీత్యా లీ.. చైనా నుంచి విదేశాలకు వెళ్లిపోయారని అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.ఇదిలా ఉంటే.. ట్విటర్ మంగళవారం నాడు లీ యాన్ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తూ ఆమెకు ఊహించని షాకిచ్చింది. ‘మా నిబంధనలు అతిక్రమించిన ఎకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అనే సందేశం ఆమె అకౌంట్‌లో ప్రస్తుతం దర్శనమిస్తోంది. ఇంతకు మించి ట్విటర్ ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. కరోనాకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న అకౌంట్‌ల విషయంలో ట్విటర్ ఇప్పటికే హెచ్చరిక సందేశాలు జోడిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పెట్టిన ఏ పోస్టు ట్విటర్ నిబంధనలను అతిక్రమించిందనే దానిపై వివరాలేమీ లేవు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

 

నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తి నీరు విడుదల

Tags:Unexpected shock to a Chinese scientist who was born in the Corona lab!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *