మరువలేని మహానేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి

– జయంతి వేడుకల్లో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

 

రామసముద్రం ముచ్చట్లు:

 

 

పేదప్రజల హృదయలలో చిరస్థాయిగా నిలిచి ఎప్పటికి మరువలేని మహానాయకుడు డాక్టర్.స్వర్గీయ వైఎస్. రాజశేఖరరెడ్డి అని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం స్థానిక సచివాలయంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి వైఎస్సార్ జయంతి కేక్ ను కట్ చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతు బంధవుడిగా నిలిచారాని అయన అన్నారు. రైతు పక్షపతి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్. వైఎస్. రాజశేఖరరెడ్డి పుట్టినరోజు జులై 8వ తేదీని రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అయన అన్నారు. ప్రతిఒక్క పేదవాడు ఆరోగ్యంగా జీవించాలానే ఉద్దేశంతో స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ ని ప్రవేశపెట్టి ఎందరికో ప్రాణదాతగా నిలిచినా మహా గొప్పనాయకుడు అని అయన అన్నారు.

 

 

 

 

అలాగే 108, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టారని పేదప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ఆర్ అని అయన అన్నారు. అయన మన మధ్య లేకపోయినా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయవలసిన ఆవశ్యకత మనందరిపై ఉందని, రాజన్న ఆశీస్సులతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యాన్ని తలపించేలా పేదల సంక్షేమం కోసం పాటు పడుతూ అనేక అభివృద్ధి పథకాలు అందిస్తున్నారని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రాణమ్మ, పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది భారతమ్మ, బత్తెమ్మ, ఉపేంద్ర, గౌతమి, రేణుక, రవి, ఏఎన్ఏం సుగుణమ్మ, వీఆర్ ఏ మహ్మద్ రఫీ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సహదేవరెడ్డి, మోహన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, వాలింటర్లు రేవతి, రెడ్డెమ్మ, మేఘన, శ్రావణి, పుష్పావతి, దినకర్, కుమారస్వామి, వెంకటరమణ, ప్రదీప్, రామచంద్ర తదితర వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

గ్రామీణరైతుల ముంగిటకే ప్రభుత్వ సేవలు- మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

Tags: Unforgettable leader Swargiya Rajasekhara Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *