జాడలేని వాన..

Unhygienic rain

Unhygienic rain

 Date:11/08/2018
కరీంనగర్ ముచ్చట్లు:
తెలంగాణలో ముసురు వాతావరణం ఉంటోంది. కానీ వానలు కురవడంలేదు. మరోపక్క ఎండలు విజృంభిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ పంటలపై అధికంగా ఉంటోంది. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలాలు వాడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే దుస్థితి. వరుణుడు కరుణించకపోవడమే ఈ దుస్థితికి కారణం. మొదట్లో కురిసిన వానలకు ప్రాజెక్టులు నిండినా.. ప్రస్తుతం నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో నీరు అందదేమోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. వర్షాభావ పరిస్థితులకు తోడు.. భూగర్భ జలాలూ పెరగలేదు. దీంతో బోర్ల నుంచీ సమర్ధవంతంగా నీరు అందని పరిస్థితి. మొత్తంగా వానలు లేక..భూగర్భ జలాలు సమృద్ధిగా లేక కర్షకులు నానాపాట్లు పడుతున్నారు. వాడిపోతున్న పంటలను చూసి దిగులు చెందుతున్నారు. జిల్లాలో పలు మండలాల్లో భూగర్భజలాలు క్షీణించిపోయాయి. కనీసం మీటరుకుపైగా పురోగతి కనిపించలేదని సమాచారం. ఈ ప్రభావం అటు పల్లెల్లోని వ్యవసాయంతోపాటు పట్టణప్రాంతాల్లోని తీగునీటిపై విపరీతంగా పడింది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో నీటికోసం కష్టాలు ఎదురవడం ఖాయమని పలువురు అంటున్నారు.   కరీంనగర్ పట్టణ ప్రాంతంలోనూ భూగర్భ జలాల క్షీణత ఆందోళనకరంగానే ఉంది. భూగర్భజల విభాగం అధికారులే ఇక్కడి పరిస్థితికి విస్తుపోతున్నారు. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూలై నెలాఖరు వరకు 2.79మీటర్ల లోతుకు జల మట్టం దిగజారింది. మే నెలలో సగటు మట్టం 22.31మీటర్లు ఉండగా జూలై చివరి నాటికి 25.10మీటర్లకు చేరడంతో ప్రమాద పరిస్థితికి సంకేతం. ప్రస్తుతం నగరానికి దగ్గర్లోనే ఉన్న లోయర్‌ మానేరు నుంచి తాగునీటిని కార్పోరేషన్‌ సరఫా చేయగలుగుతోంది. ప్రజలకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటోంది. నిత్యం 60.38ఎంఎల్‌డీల డిమాండ్‌లో లక్ష్యానికి చేరువగానే వీలైనన్ని నీటిని నల్లాల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ప్రతి నివాస గృహాల్లోని బోరు బావుల్లో నీళ్లు పాతాళం దిశగా చేరుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని స్థానికులు గ్రహించలేకపోతున్నారు. అవసరం ఉన్న లేకున్నా నీటిని అధికంగా వాడడం, వృథా చేస్తుండటం, వాననీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలు విస్తృతంగా లేకపోవడం భూగర్భజలాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పటికైనా ప్రజలు స్పందించి నీటిని వృధా చేయడం మానుకోవాలి. భూగర్భజలాలను మెరుగుపరచేందుకు వాననీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలుముమ్మరంచేయాలి.
Tags:Unhygienic rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *