Natyam ad

శివాలయం పై కన్నేసిన గుర్తుతెలియని దుండగులు

నందవరం ముచ్చట్లు:

మండలం రాయచోటి గ్రామంలోని పురాతన శివాలయంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాయచోటి గ్రామంలో శివాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది ఈ శివాలయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ అధికారులు కనీసం ఈ దేవాలయం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు దీంతో శివాలయం పై కన్నేసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల కిందట వచ్చి దేవాలయంలో నంది విగ్రహం కింద తవ్వకాలు జరిపి గుప్తనిధుల కోసం ప్రయత్నించారు దేవాలయం పరిసర ప్రాంతాల్లో పొలాలు చేసుకుంటున్న రైతులు ఈ విషయాన్ని గమనించారు వెంటనే గ్రామస్తులు పోలీసులకు ఈరోజు సమాచారం అందించారు దేవాలయంపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు మేల్కొని దేవాలయాన్ని సంరక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Unidentified assailants attacked the Shiva temple

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.