మంచినీటి పైపులైను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

– ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

– సర్పంచ్ రామగిరి లావణ్య

పెద్దపల్లి  ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మంచినీటి వాటర్ పైప్ లైను ను ధ్వంసం చేయడం జరిగింది స్థానికులు ఈ విషయం ముత్యాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజుకి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి పైప్లైన్ వద్దకు వచ్చి పరిశీలించి వారు మాట్లాడుతూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటర్ పైప్ లైన్ ను బండతో పగులగొట్టడం జరిగింది అని అన్నారు. ఈ విషయం గోదావరిఖని 2 టవున్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు. మేము గెలిచిన అప్పటినుండి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా రక్షణ మాకు ముఖ్యంగా అభివృద్ధిలో మేము ఎన్నడు వెనుకంజ వేయకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ వెంటనే స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే గ్రామ సేవ మా లక్ష్యం గా సేవే చేస్తున్నామని ఇలాంటి నీచమైన చర్యలు చేయడం బాధాకరమని గ్రామా ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్లను ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టేది లేదని మేము సర్పంచ్ గ గెలవక ముందునుండే మేము ఎక్కడ అన్యాయం జరిగిన ఎదిరించేవాళ్ళము మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని ఇలాంటి నీచమైన పనులు చేసేవాళ్లకు గ్రామా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సర్పంచ్ తెలిపారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Unidentified persons who destroyed the fresh water pipeline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *