అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ హత్య

-రాగిమానుకుంట రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం పదిపుట్లబైలు కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు మార్గంలో పదిపుట్లబైలు పంచాయితీ రాగిమానుకుంట రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో గుర్తుతెలియన మహిళను హత్య చేసి తలపై పెట్రోల్ పోసి కాల్చివేసిన సంఘటన జరిగింది.
మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి సుమారు మూడు రోజులు అయ్యి ఉంటాదని చెబుతున్నారు. హత్య చేయబడ్డ మహిళ వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలలోపు ఉంటుంది. పాకాల సి.ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Unidentified woman murdered under suspicious circumstances

Leave A Reply

Your email address will not be published.