విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

Uniform distribution to students

Uniform distribution to students

Date:26/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కొత్తపేట స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాంలను సోమవారం కౌన్సిలర్‌ ఇబ్రహిం, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దిన్‌ షరీఫ్‌ కలసి పంపిణీ చేశారు. పాఠశాలలో హెచ్‌ఎం అయిషా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పకృద్ధిన్‌షరీఫ్‌ మాట్లాడుతూ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తగిన ఉపాధ్యాయులను నియమించి, నాణ్యమైన బోధన జరిగేలా చూడాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు జూన్‌ నెలలో పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. సకాలంలో విద్యాసామాగ్రీ, యూనిఫాంలు అందజేయకపోతే తల్లిదండ్రులకు యూనిఫాంలు కొనుగోలు చేయడం అదనపు భారమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మదాలి, యూసఫ్‌, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

 

బిఆర్‌ అంబేద్కర్‌కు ఘన నివాళులు

Tags; Uniform distribution to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *