Uniforms distributed

Uniforms distributed

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బసవరాజ ఉన్నత పాఠశాలలో యూనిఫాంలు పంపిణీ కార్యక్రమాన్ని ఎంఈవో లీలారాణి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్షా అభియాన్‌ వెహోబలైజింగ్‌ అధికారి జయప్రకాష్‌ హాజరై గురువారం యూనిఫాంలు పంపిణీ చేశారు. అలాగే 23వ వార్డులో గల ఎల్‌ఐసి కాలనీ, కొత్తయిండ్లు పాఠశాలల్లో కౌన్సిలర్‌ మనోహర్‌ యూనిఫాంలను పంపిణీ చేశారు. గురువారం హెచ్‌ఎం ఈశ్వర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్‌ మనోహర్‌ దుస్తులు పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ నెలలో యూనిఫాంలు పంపిణీ చేయాలని డిమాండు చేశారు. పాఠశాలలు తెరిచిన ఆరు నెలలకు యూనిఫాంలు పంపిణీ చేయడం బాధకరమన్నారు. ప్రభుత్వం ఈ విషయాలపై వెంటనే చర్యలు తీసుకుని, సకాలంలో విద్యార్థులకు అవసరమైన సామాగ్రీని అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వసుంధర, ఉపాధ్యాయులు లక్ష్మిదేవి, నాగలక్ష్మి, భారతి, లీలావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

25న దాత్రిపూజలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాక

Tags; Uniforms distributed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *