ఎస్వీబీసీకి యూనియన్ బ్యాంకు రూ.54.16 లక్షల స్పాన్సర్షిప్
తిరుమల ముచ్చట్లు:
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు రూ.54.16 లక్షల స్పాన్సర్షిప్ అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ మేరకు చెక్కును టిటిడి ఈవో మరియు ఛానల్ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్, బ్యాంకు డిజిఎం పిడివి.శర్మ, బ్రాంచి మేనేజర్ జి.సాంబశివరావు, బ్యాంకు పిఆర్వో టి.రమేష్ బాబు పాల్గొన్నారు.

Tags:Union Bank sponsors SVBC for Rs 54.16 lakh
