కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

Date:15/11/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశ రాజధానిలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. దీపావళి తర్వాత వైరస్‌ ఉధృతి, దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.కాగా, గత కొన్ని నెలలుగా ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ ఉమ్మడి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఏక్యూఐ ఇండెక్స్‌ నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ అధికారులు తెలిపారు. బాణసంచాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. గాలి నాణ్యతలో మార్పు రాలేదన్నారు. గడిచిన 24 గంటల్లో ఏక్యూఐ 461 పాయింట్లు నమోదైందని వెల్లడించారు.

అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్

Tags; Union Home Minister Amit Shah holds emergency meeting with Delhi CM Arvind Kejriwal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *