యువతకు బంగారు బాట కేంద్ర మంత్రి భగవర్ కిషన్ రావు కరద్
విశాఖపట్నం ముచ్చట్లు:

దేశ యువత భవిష్యత్తుకు బిజెపి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ అన్నారు.విశాఖ నగరం ఎంతో అందంగా, పరిశుభ్రంగా ఉందని అదేవిధంగా మంగళవారం 5వ విడత ప్రధానమంత్రి రోజ్ ఘర్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా విచ్చేశానన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మంగళవారం 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని పోర్టు కళవాణి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 400 మంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఉద్యోగాలు సాధించిన వారికి ఈ నియామక పత్రాలు తాను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి రోజ్ ఘర్ యోజన కార్యక్రమం ప్రారంభించి ఏడాదిన్నర అవుతుంది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు లక్షల 50 వేల మంది నిరుద్యోగులకు తమ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి భీమా యోజన, వంటి కేంద్ర ప్రభుత్వం పథకాలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించమని ఈ సమావేశంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించడం కోసం నాబార్డ్ సహకారంతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని. దేశంలో నీతి అయోగ్ 112 జిల్లాలు వెనుకబడ్డాయని విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జిల్లాలు ఉన్నాయని ఈ జిల్లాల అభివృద్ధికి అవసరమయ్యే నిధులు మరియు సంక్షేమ కార్యక్రమాలపై చర్చలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి రావత్ పాల్గొన్నారని ఆయన తెలిపారు.
అనంతరం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని తమ పార్టీ నాయకులతో భేటీ అయ్యేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చానని పార్టీ బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సేల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, బిజెపి అధికారిక స్పోక్స్ పర్సన్ సుహాసిని ఆనంద్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Union Minister Bhagwar Kishan Rao Karad is the golden path for youth
