Union Minister Kishan Reddy hoisting the national flag

 జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Date:15/08/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి. కిషన్ రెడ్డి  న్యూఢిల్లీ లోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అయన  భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కోవిడ్ ప్రోటోకాల్కు అనుగుణంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వ్యక్తులతో మంత్రి మాట్లాడుతూ, దేశానికి పవిత్రమైన, ముఖ్యమైన ఈ రోజు  ప్రాముఖ్యతను మంత్రి గుర్తుచేసుకున్నారు. “మన స్వాతంత్ర్య పోరాటంలో మహానభావులు అనుసరించిన మార్గం, తమ జీవితాలను స్వాతంత్య్ర సిద్దికోసం  ఈ విధంగా పోరాటం చేశారో స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారి గొప్ప విలువలను అనుసరించాలని”, మంత్రి కోరారు.
కేంద్ర భద్రతా దళాలు దేశ సేవలో నిర్వహిస్తున్న పాత్రను ఈ సందర్భంగా  కిషన్ రెడ్డి అభినందించారు. దేశానికి వారు చేసిన నిస్వార్థ సేవకు వారికి, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి సమయంలో, కేంద్ర భద్రతా దళాల సేవ మరువలేనిది అని పేర్కొన్నారు. “మనమందరం ఒక సంకల్పం తీసుకొని దేశాన్ని అభివృద్ధి, కీర్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలి”, అని  కిషన్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

పులి సంచారం…. భయాందోళన లో  ప్రజలు..

Tags: Union Minister Kishan Reddy hoisting the national flag

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *