Natyam ad

మూసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు
అంబర్పేట్ ముసారంబాగ్ బ్రిడ్జిను  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలు వర్షాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నడిపిస్తున్నాడన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలకు పోకుండా ప్రజల కోసం ఆలోచించాలని అయన అన్నారు. మీరు పరిపాలించే టైము ఓన్లీ సంవత్సరం తర్వాత మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. బిజెపిని ఎంతగా తిడుతుంటే మీ పతనం అంతా దిగజారుతుంది అని గ్రహించాలన్న కిషన్  రెడ్డి మీడియాతో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ భారీ వర్షాలు కురుస్తుంటే  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేయడం ఏంటిదని ప్రశ్నించారు  హైదరాబాదులో వరదలు  ముంచేత్తుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని  గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అవస్థలు పడుతున్నారని సంవత్సరం కాలంలో ప్రజలకు శ్రేయస్సు కలిగే పనులు చేయాలని  ఇంకో సంవత్సరం పరిపాలన చేసుకున్న తర్వాత  రాబోయే రోజుల్లో    బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు…

Tags: Union Minister Kishan Reddy inspected Moosarambagh Bridge…