కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలి

యాదాద్రి ముచ్చట్లు:

ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బిర్ల.ఐలయ్య మంగళవారం మీడియాతో మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై సోమవారం  పార్లమెంట్ లో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి  తీసుకోని రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేసారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా తెలుగు మాట్లాడే మంత్రి తెలుగు లో మాట్లాడిన ఒక ఎంపి ని  కించపరిచే విదంగా మాట్లాడిన మాటలు అవమానకరమని అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యాలు లు యావత్ దేశాన్ని తలదించుకునేలా ఉందని అయన మండిపడ్డారు..

 

Tags: Union Minister should apologize

Post Midle
Post Midle