Natyam ad

కాళేశ్వరం ప్రాజెక్టుపై  కేంద్ర మంత్రులది పూటకో మాట

పార్లమెంట్ లో ఓ మాట… ప్రజాక్షేత్రంలో ఓ మాట.
ఢిల్లీలో ఓమాట….గల్లీలో ఓమాట…
మంత్రి హరీష్ రావు

 

మేడ్చల్ ముచ్చట్లు:

Post Midle

మేడ్చల్ లో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బుధవారం శంకుస్థాపన చేసారు. మంత్రి హరీష్ రావు మాట్లాడతూ  మెడ్చెల్ బాగా విస్తరిస్తుంది. మంచి హస్పిటల్ కావాలని కోరారు. ఈ ఆసుపత్రిలో కొత్తగా 8 మంది డాక్టర్లను ఇస్తాం.  16 మంది స్టాఫ్ నర్సులు మొత్తం 50 సిబ్బందినిఅదనంగాఇస్తాం. ఉన్న ఆసుపత్రికిఅదనంగా బిల్డింగ్ ఇస్తం.   ఏడున్నర కోట్లతో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసాం.  ఎనిమది నెలల్లో పూర్తి చేస్తం.  ప్రయివేటుఆసుపత్రిలోకాన్పుఅయితే 30 నుంచి 50 వేలు ఖర్చు. ఇక్కడఅంతా ఉచితం కేసీఆర్ కిట్ , 13 వేల రూపాయలుఇస్తున్నం. ముహూర్తం చూసి కాన్పుకు వెళ్తున్నరు. ఇది తల్లికి- బిడ్డకు నష్టం.  పెద్దాపరేషన్ చేయమని డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నరు. దీని వల్ల  తల్లి ఆరోగ్యం చెడిపోతుంది.  ఏ పని చేతకాని పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఖర్చు. 40  ఏళ్లకే అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. లేని చిక్కులు తెచ్చుకోవడమేనని అన్నారు.
ప్రాణానికి హని ఉంటేనే డాక్టర్లు ఆపరేషన్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తరు. మనమే చేయమని అంటే ఏలా అమెరికా లాంటి దేశాల్లో 20-30 శాతమే ఆపరేషన్లు. మనం ఇక్కడ 7-80 శాతం ఆపరేష్లు చేస్తున్నరు. ఇలా చేయడం పిల్లలకు నష్టం. తొలి గంటలో తల్లి పాలు బిడ్డ తాగడం  టీకాలాంటిది. పెద్దాపరేషన్ వల్ల తల్లి పాలు తాగే అవకాశం బిడ్డ కోల్పోతుంది. దాని వల్ల రోగ నిరోథక శక్తి పిల్లల్లో తగ్గిపోతుంది. కొద్ది మంది పిల్లలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

 

 

గాంధీలో 250, నిమ్స్ లో 250 పడకల మాతా శిశు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నం.  ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నం. అత్యున్నతమైన ఎక్విప్ మెంట్ అందుబాటులోకి తెస్తున్నం. పేదలు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి  అప్పులుకావద్దని, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ఖర్చు చేస్తున్నం. బస్తీల్లో డాక్టర్లు పెట్టి పేదల సుస్తి పొగొట్టడానికి బస్తీ దవాఖానాలు, మేడ్చెల్ లో 13 బస్తీ దవాఖానాలు ప్రారంభానికి రెడీగా ఉన్నయి. మరో పది రోజుల్లో ఇవి ప్రారంభిస్తం. జ్వరం,వాంతులు, విరోచనాలు ఏది వచ్చినా ప్రయివేటు డాక్టర్లు, ఆర్ఎంపీల దగ్గరు పోతున్నరు. పరీక్షలు రాస్తే చాలా ఖర్చు. అందుకే బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా, మందులు ఉచితంగా ఇస్తున్నం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 350 బస్తీ దవాఖానాలు పెట్టి వైద్యసేవలు ఉచితంగా ఇస్తున్నం. మీరు వాటిని వాడుకోండి.

 

 

నార్మల్ డెలివరీ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు , స్టాఫ్ నర్సుకు, ఆశానర్సుకు  ప్రోత్సహకాలు ఇస్తున్నం. పెద్దాపరేషన్ చేస్తే సున్న. నార్మల్ డెలివరీ చేస్తే 3 వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నమని అన్నారు.కిషన్ రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూడు. ఎయిమ్స్ ప్రరువు తీశారు. దిగజార్చింది  కేంద్ర ప్రభుత్వం. ఇవాళ్టికి ఒక్క కాన్పు, ఆపరేషన్ కాలే.  భువనగిరి  ఏరియా ఆసుపత్రిలో 1083 డెలివరీలు అయినయి. రామన్న పేట ఏరియా ఆసుపత్రుల్లో 245 డెలివరీలు జరిగాయిచౌటుప్పల్ లో 214 డెలివరీలు అయినయి. బీబీ నగర్  ఎయిమ్స్ ఉన్న అర్బన్ పీహెచ్ సీ లో 13 డెలివరీలు అయినయి. మీ ఎయిమ్స్ లో ఒక్కటంటే ఒక్క డెలివరీ కాలేదు. ఇది మీ బీజేపీ పని తీరు. ఇది కేంద్ర ప్రభుత్వ పని తీరు. మాటలు ఎక్కువ- చేతలుత క్కువ. పేరు గొప్ప- ఊరు దిబ్బ లెక్క ఉంది . మీ ఎయిమ్స్ కత ఇది.నాలుగేళ్లయి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నరు. అక్కడు వెళ్లి పట్టించుకోవచ్చు కదా. మేం రోజు ఆసుపత్రులు తిరుగుతున్నం.  61 శాతం ఇవాళ తెలంగాణ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్నయి. తెలంగాణ వచ్చినప్పుడు 30 శాతం ఉండే ఆనాడు. 31 శాతం పెరిగింది.వసతులు పెరిగాయి . ప్రజలకు నమ్మకం పెరిగింది. అది మా పని తీరు… మీ పని తీరు సున్న. ఇప్పుటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోండని అన్నారు.

 

Tags: Union Minister’s closing statement on Kaleshwaram project

Post Midle

Leave A Reply

Your email address will not be published.