కాకినాడలో కేంద్ర మంత్రి పర్యటన

కాకినాడ ముచ్చట్లు:

సుపరిపాలన, పేదల సంక్షేమం లక్ష్యంగా కొనసాగిన ఎనిమిదేళ్ల కేంద్ర ప్రభుత్వపాలన దేశ సర్వతో వికాసానికి సుస్థిర బాటలు వేసిందని కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పశు సంవర్ధక, పాడి శాఖల సహాయ మంత్రి డాక్టల్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు.కాకినాడలో కేంద్ర మంత్రి మురుగన్ కలెక్టరేట్ వివేకానంద హాల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అలాగే ఆయా పథ కాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను వివరించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలన, పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థ లో నవశవకానికి నాంది పలికాయన్నారు. పేదరిక నిర్మూలన, సత్వర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలు లబ్ధిదారులకు సమగ్రంగా అందేలా అధికారులు చూడాలన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ నేషనల్ ఫిషరీష్ డవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని కాకినాడలో ఏర్పాటుచేయాలని కేంద్ర సహాయ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఎంటర్ ప్రైన్యూర్ మోడల్, భారతీయ ఆయుష్మాన్, భారత్ పాం పనో తీర ప్రాంత చెరువుల వ్యవసాయం అంశాలపై నేషనల్ ఫిషరీస్ డవలప్మెంట్ బోర్డు ముద్రించిన కరపత్రాలను మురుగన్ ఆవిష్కరించారు.

 

Tags:Union Minister’s visit to Kakinada

Natyam ad