నరసాపురంలో కేంద్ర మంత్రి పర్యటన
నరసాపురం ముచ్చట్లు:
కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ సహాయ మంత్రి, ప్రవాస్ యోజన ఏపి పరిశీలకులు మురళీ ధరన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా నరసాపురం రైల్వే స్టేషన్ కు చేరుకుని రైల్వే శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చిం చారు.డబ్లింగ్, విద్యుదీకరణ, ఆర్ ఓబి, నరసాపురం టు కోటిపల్లి రైల్వే లైన్ ఏర్పాటు పనుల పురోగతిపై సంబధిత అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు.రైల్వే స్టేషన్ ను పరిశీలించిన సందర్భంలో బయట డిస్ప్లే చేసిన బోర్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.అనంతరం మాట్లాడుతూ అతి సామాన్యుడు దేశ మంతా మంచి సౌకర్యాలుతో, సులభంగా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలన్నదే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశం అని అయన అన్నారు. దేశ అభివృద్ధి మౌళిక సదుపాయాలు పైనే ఆధార పడి ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలు జాతీయ రహదారులు నాలుగు,ఆరు లైన్లు గా అభివృధ్ది కి, రైల్వే అభివృధ్ది కి ప్రత్యేక దృష్టి పెట్టి దశలు వారీగా పనులు వేగవంతం చేస్తున్నదని తెలిపారు…
Tags: Union Minister’s visit to Narasapuram

