లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండానే సార్వత్రిక ఎన్నికలు

Universal elections without Lalu Prasad Yadav
Date:19/03/2019
బీహార్ ముచ్చట్లు:
లాలూ ప్రసాద్ యాదవ్… పరిచయం అక్కరలేని పేరు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండానే సార్వత్రిక ఎన్నికలు ఈసారి జరుగుతున్నాయి. లాలూ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఈ ఎన్నికల్లో లేకపోయానన్న బాధ మాత్రం లేదట. ఎందుకంటే జైలు నుంచే ఆయన సర్వం చక్క బెడుతుండటమే ఇందుకు కారణం. బీహార్ రాజకీయాలు అంటేనే ముందుగా గుర్తొచ్చేది లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే. ఆయన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ బీహార్ లో బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ యాదవ్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేసి అధికారం చేజిక్కించుకున్నా చివరకు నితీష్ కుమార్ హ్యాండిచ్చి వెళ్లిపోవడంతో పవర్ కు దూరమయ్యారు.ఇప్పుడు బీహార్ లో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది. సహజంగా లాలూ యాదవ్ ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉంటే ఆ కిక్కే వేరంటారు బీహారీలు. ఎందుకంటే ఆయన చేసే ప్రచారం నవ్వులను పూయిస్తుంది. అయితే ఈసారి లాలూకు ఆ అవకాశం లేదు. రాంచీ జైల్లో ఉండటంతో ఎన్నికలతో పాటు ప్రచారానికి కూడా లాలూ దూరంగా ఉండాల్సి వస్తోంది. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీలు జట్టుగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పుడు ప్రచార బాధ్యత మొత్తాన్ని లాలూ యాదవ్ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ ప్రచారన్ని చేస్తున్నారు.అయతే లాలూ రాంచీ జైల్లో ఉన్పప్పటికీ సీట్ల పంపంకం దగ్గర నుంచి ప్రచారం ఎలా చేయాలన్న దానిపై కూటమితో టచ్ లో ఉంటున్నారు. సలహాలు ఇస్తున్నారు.
ఏఐఎస్ఎఫ్ నేత కన్హయ్య కుమార్ కు సీటు ఇవ్వవద్దని రాంచీ జైలు నుంచే లాలూ యాదవ్ ఆదేశించడంతో లాలూ పవర్ ఏంటో తెలిసిపోయింది. కన్హయ్య కుమార్ బీహార్ లోని బెగూసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ కూటమిలో సీపీఐ కూడా ఉండటంతో ఆ సీటు కోసం కన్హయ్య కుమార్ ప్రయత్నించారు. అయితే లాలూ ససేమిరా అనడంతో ఈసీటు కన్హయ్య కుమార్ కు రావడం కష్టమేనంటున్నారు.లాలూ యాదవ్ రాంచీ జైలు నుంచే చక్రం తిప్పుతున్నారు. కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ లిద్దరూ సమన్వయంతో పనిచేసేలా వారికి జ్ఞాన బోధ చేస్తున్నారు. ఈ ఎన్నికలు లాలూకు అత్యంత అవసరం. మోదీ ప్రభుత్వం కేంద్రంలో రాకుంటేనే లాలూ జైలు నుంచి బయటకు వస్తారు. లేకుంటే అక్కడే మగ్గిపోవాల్సిందే. అందుకే లాలూ యాదవ్ బీహార్ లో కూటమికి అత్యధిక సీట్లను తెచ్చేందుకు నాలుగు గోడల నుంచే ప్లాన్ చేస్తున్నారు. మరి లాలూ పరోక్షంగా జరిగే ఈ ఎన్నికలలో గెలుపు ఎవరిదన్నది చూడాల్సి ఉంది.
Tags:Universal elections without Lalu Prasad Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *