ఢిల్లీలో అన్ లాక్ స్టార్ట్

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపునకు కేజ్రీవాల్ సర్కారు సిద్ధమయ్యింది. అన్‌లాక్ ప్రక్రియపై సీఎంఅరవింద్ కేజ్రీవాల్ శనివారం విధివిధానాలను వెల్లడించారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను సరి-బేసి విధానంలో తెరవడానికి అనుమతించారు. గతంలో వాయు కాలుష్య నివారణకు సరి-బేసి విధానాన్నే ఢిల్లీ ప్రభుత్వం అనుసరించింది. స్వతంత్ర దుకాణాలను రోజూ తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. 50 శాతం ప్రయాణీకులతో ఢిల్లీ మెట్రో నడపనున్నట్టు తెలిపారు.స్థిరమైన పని వేళలతో ప్రయివేట్ సంస్థలు 50 శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు నిర్వర్తించాలి.. వీలైనంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభించాలని కేజ్రీవాల్ కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కేటగిరీ-ఏ ఉద్యోగులు రోజూ కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ, అన్ని కేటగిరీల ఉద్యోగులు 50 శాతం మందినే అనుమతిస్తామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.‘‘పరిస్థితి మెరుగుపడితే మరిన్ని సడలింపులు ఇస్తామని, ప్రస్తుతం ఇదే అమల్లో ఉంటుంది’’అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘‘పిల్లలకు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోందని, వారికోసం ప్యానెల్ ఏర్పాటు చేస్తామని.. అలాగే తదుపరి దశను గుర్తించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం .కోవిడ్-19 థర్డ్ వేవ్ కోసం మేం సిద్ధమవుతున్నాం.. ఆ సమయంలో పాజిటివ్ కేసులు 37,000 గరిష్టానికి చేరవచ్చని అంచనాలున్నాయి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.గడచిన కొన్ని వారాల్లో ఢిల్లీ ఎదుర్కొన్న ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 64 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే, రెండు జినోమ్ ట్రాకింగ్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని, దీని వల్ల వైరస్, వేరియంట్స్‌ను అవగాహన చేసుకోవచ్చని అన్నారు. కోవిడ్ చికిత్సకు సహాయం చేయాలా వద్దా అనే దానిపై సలహా ఇచ్చే వైద్యుల బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.ఢిల్లీలో శుక్రవారం 523 కేసులు నమోదుకాగా.. 50 మంది చనిపోయారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.68 శాతానికి పడిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం గతవారం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఉత్పత్తి, నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించింది. ఏప్రిల్ 19 నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెండో దశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. కరోనా బాధితులు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ఔషధాల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Unlock start in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *