జనగణమనకు అపూర్వ స్పందన

Unprecedented response to demographics

Unprecedented response to demographics

Date:21/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో నిత్యజనగణమన కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సెంటర్‌లాడ్జిలో కూడ జనగణమన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం వైఎస్సార్సీపి మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మాజీ కౌన్సిలర్‌ పూలత్యాగరాజు జెండాను పట్టుకుని ఆలపించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాలతో పాటు విస్తరణ ప్రాంతాలలో కూడ జనగణమన గీతాలాపనను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు తమ సహకారం అందిస్తామన్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు అనిల్‌కుమార్‌, మదుసూదనజెట్టి, పరమేష్‌, టిజె.అమర్‌, వెంకటేష్‌ మొదలి ,రమేష్‌ బాబు, వేలూరు రాజమొదలి, శ్రీనివాసులు, మురళి, సుమన్‌కుమార్‌
, వెంకటేష్‌ , మిట్టా మురళి, పూల జయన్న, భవేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ వైపు వంతల చూపు

Tags: Unprecedented response to demographics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *