Natyam ad

పుంగనూరులో గడప గడపకు అపూర్వ స్పందన

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి గడప గడపకు కార్యక్రమాన్ని బాలాజి థియెటర్‌ వద్ద, అహమ్మద్‌నగర్‌, ఎంబిటి రోడ్డు, తూర్పువెహోగశాల ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ మున్సిపాలిటి పర్యటనలో ప్రజలు ఎంతో అప్యాయంగా ఆదరిస్తూ స్వాగతం పలుకుతున్నారని కొనియాడారు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలుసుకునేందుకు నాయకులు వెళ్లేవారని తెలిపారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధికారులు, నాయకులు, ప్రజలను తరచుగా కలవడం , వారి కష్టసుఖాలను తెలుసుకోవడంతో ప్రజలకు భరోసా లభించిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందరు మన ఇంటి వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని , ఈ ప్రభుత్వం ఎల్లప్పుడు ఉండాలంటు ఆశీర్వధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు సుప్రియ, త్యాగరాజు, నటరాజ, అమ్ము, కాంతమ్మ, రెడ్డెమ్మ, నరసింహులు, కిజర్‌ఖాన్‌, కాళిదాసు, జెపి.యాదవ్‌, రాఘవేంద్ర, రేష్మా, భారతి, విజయభారతి, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Unprecedented response to Gadapa Gadapa in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.