పుంగనూరులో గడప గడపకు అపూర్వ స్పందన – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమాన్ని మండలంలోని కల్లుపల్లె, అగ్రహారం, బాలగుర్రయ్యగారిపల్లె, నాయుడుఇండ్లు, రాజులూరు గ్రామాల్లో మంత్రి పీఏ చంద్రహాస్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగ రాజారెడ్డితో కలసి నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు అందరి సహకారంతో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. వ్యక్తిగత సమస్యలను కూడ స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రాగానిపల్లె బాబు, చంద్రారెడ్డి యాదవ్‌, వెంకటరెడ్డి, గురివిరెడ్డి , నారాయణరెడ్డి, రెడ్డెప్ప, బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Unprecedented response to Gadapa Gadapa in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.