పుంగనూరులో వైద్యశిభిరానికి అపూర్వ స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులచే శనివారం నిర్వహించిన కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు నాగరాజ, మునస్వామివెహోదలియార్, చెంగారెడ్డి ఆధ్వర్యంలో శంకర్నేత్రాలయ వారు వైద్యశిబిరం నిర్వహించారు. 73 మంది రోగులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు దీలిప్కుమార్, శ్రీనివాస్న్, చెంగారెడ్డి, కృష్ణారెడ్డి, ఆనందజెట్టి, దొరస్వామి, సుబ్బరామయ్య, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
Tags: Unprecedented response to Vaidyashibira in Punganur