వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి అపూర్వ స్పందన

Unprecedented response to YSR Health

Date:22/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో గురువారం వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లబించింది. మదనపల్లెకు చెందిన బాలాజి మల్టీస్పెషాలిటి, విశ్వం ఆర్థోపిడిక్‌ వారిచే శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి సుగాలిమిట్ట సమీప ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై,వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్యశిబిరంలో డాక్టర్లు కమలాకర్‌, సామ్రాట్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, నషర లు హాజరై పరీక్షలు నిర్వహించారు. మండల పిహెచ్‌సి వైద్యాధికారి సోనియా, డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ బాల ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం క్రింద గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పోరేట్‌ వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన రోగులందరికి ప్రభుత్వ పరంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ క్రింద తగిన ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరం వైఎస్సార్సీపి నాయకుడు ఖాదర్‌బాషాతో పాటు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు , అంగన్‌వాడీ వర్కర్లు , గ్రామస్తులు హాజరైయ్యారు.

పకడ్బందీగా వాలంటీర్ల పరీక్షల ఏర్పాట్లు

Tags: Unprecedented response to YSR Health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *