పుంగనూరులో గడప గడపకు అపూర్వ ఆధరణ – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ ఆధరణ లభిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి కార్యక్రమాన్ని సింగిరిగుంట గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు నీరాజనాలతో ఘన స్వాగతం పలికారు. జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను ఎంపీపీ పంపిణీ చేసి, ఇంటింటికి అందిన సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీపీ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా గ్రామ పరిపాలనకు శ్రీకారం చుట్టి , వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. దీని ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే సేవలు అందించడం జరుగుతోందన్నారు. ప్రతి కుటుంభానికి నవరత్నాల ద్వారా రూ.1.50 లక్షల నుంచి సుమారు రూ. 5 లక్షల వరకు లభ్దిచేకూరిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరులో అర్హులైన పేదలందరికి పథకాలు అందించి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, మంగళం రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కనకదుర్గా సత్యనారాణయణ, నాగభూషణం, ప్రశాంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Unprecedented support for Gadapa Gadapa in Punganur – MPP Bhaskar Reddy.

Leave A Reply

Your email address will not be published.