Natyam ad

ముందుకు సాగని అండర్ గ్రౌండ్ పనులు

వరంగల్ ముచ్చట్లు:


హ‌న్మకొండ గోపాల్‌పూర్ ప్రాంతంలో కొన‌సాగుతున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ డ‌క్ట్ ప‌నులు మంద‌గ‌మ‌నంతో సాగుతున్నాయి. 100 ఫీట్ల రోడ్డును త‌వ్వేసి.. అండ‌ర్ గ్రౌండ్ నిర్మాణాలు చేప‌డుతున్న కార‌ణంగా ఈ మార్గంలోని ప‌దుల సంఖ్యలోని కాల‌నీవాసులు దాదాపు ఆరు నెల‌లుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే కాజీపేట‌-కేయూ, హ‌న్మకొండ‌, వ‌డ్డెప‌ల్లి ఏరియాల‌కు 100 ఫీట్ల రోడ్డు అనుసంధానంగా ఉండేది. ఈ రోడ్డుపై రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతుండ‌టంతో వాహ‌న‌దారుల‌కు అగ‌చాట్లు త‌ప్పడం లేదు. సమ్మయ్య నగర్‍, టీవీ టవర్‍ కాలనీ, కేయూ, అమరావతి నగర్‍, వాంబే కాలనీ, ఆదర్శనగర్‍, గోపాల్‍పూర్‍ ప్రాంతాల‌కు చెందిన వంద‌ల సంఖ్యలోని చిరు వ్యాపారాల‌కు, ప్రైవేటు కార్యాల‌యాల‌కు, పాఠ‌శాల‌లు ఈ మార్గానికి ఇరువైపులా ఉన్నాయి. దీంతో వీరంతా ఇబ్బందుల పాల‌వుతున్నారు.అంతేకాకుండా చిరు వ్యాపారం చేసుకునేవారు వంద‌లాది మంది ఇక్కడ చాలా ఏళ్లుగా నివాస‌ముంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు ప‌నులు కొన‌సాగుతుండ‌టంతో వారి ఉపాధికి దెబ్బప‌డింది. ప‌నులు ఎప్పుడు ముగుస్తయిరా దేవుడా అంటూ ఊసురుమంటున్నారు. కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చిన గ‌డువు ముగిసి మూడు నెల‌ల‌కు పైగా కావ‌స్తున్నా ఇంకా చేప‌ట్టాల్సిన ప‌నులు 40శాతం వ‌ర‌కు ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌నులు జ‌రుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో ప‌నులు పూర్తికావ‌డం గ‌గ‌న‌మేన‌ని స్పష్టమ‌వుతోంది.హ‌న్మకొండ‌లోని వ‌డ్డెప‌ల్లి, గోపాల్‌పూర్‌, స‌మ్మయ్యన‌గ‌ర్‌, అమ‌రావ‌తి న‌గ‌ర్‌లో ప్రతీ ఏటా వ‌ర‌ద‌ల్లో నీట మున‌గ‌డం ప‌రిపాటిగా మారింది. గ‌త ఏడాదిన్నర క్రితం వ‌చ్చిన వ‌ర‌ద‌లతో దాదాపు రెండు వారాల పాటు నీటిలోనే మునిగి క‌నిపించాయి ఈ కాల‌నీలు. అయితే వ‌ర‌ద ప్రవాహాన్ని న‌గ‌ర బ‌య‌ట‌కు త‌ర‌లించేందుకు, కాల‌నీల‌ను నీటి మున‌క నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప‌థ‌కం కింద అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ, డక్ట్ పనులకు రూ.54 కోట్లతో గోపాల్‍పూర్‍ చెరువు ఊర చెరువు నుంచి సమ్మయ్యనగర్‍ ప్రెసిడెన్సీ స్కూల్‍ వరకు 1.5 కిలోమీటర్ల మేర ఈ ప‌నులు చేప‌డుతున్నారు.

 

 

ఈ ప‌నుల టెండ‌ర్‌ను ద‌క్కించుకున్న ఓ ప్రముఖ సంస్థ గ‌త ఏడాది చివ‌రాంఖంలో ప‌నుల‌ను ఆరంభించింది. ప‌నులు ఆల‌స్యంగా న‌డుస్తుండ‌టంతో కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న సద‌రు సంస్థ పనుల‌ను విభ‌జించి స‌బ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ ఏడాది మే నాటికే పూర్తి చేయాల్సి ఉండ‌గా చేయ‌లేదు. మూడు నెల‌లు గ‌డువు పెంచారు. అయిన‌ప్పటికి మొత్తం ప‌నుల్లో ఇంకా 40 శాతం వ‌ర‌కు పెండింగ్ ఉండ‌టం గ‌మ‌నార్హం. కొన్నిచోట్ల డ్రైనేజీ బాక్స్ నిర్మాణం పూర్తయింది. ప్రధానంగా గోపాల్‌చెరువు మోరీ వ‌ద్ద ప‌నులు ఇంకా ఆరంభం కాక‌పోవ‌డంతో, ఈ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని ఇరిగేష‌న్ అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.కాంట్రాక్ట్ సంస్థకు వాస్తవానికి వ‌ర్షకాల‌మే అయినా పెద్దగా అవాంత‌రాలేమీ జ‌ర‌గ‌లేదు. అనుకున్న స‌మ‌యానికి ప‌నులు పూర్తి చేసేందుకు జీడ‌బ్ల్యూఎంసీ, ఇరిగేష‌న్ అధికారులు సైతం త‌మ తోడ్పాటును అందించారు. స‌ద‌రు సంస్థ ప‌నుల పూర్తికి స‌రైన ప్రణాళికతో వ్యవ‌హ‌రించ‌లేద‌న్న అభిప్రాయం అధికార వ‌ర్గాల నుంచే వ్యక్తమ‌వుతోంది. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..సిబ్బందిని పెంచుకుని ప‌నులు నిర్ధిష్ఠమైన కాలంలో పూర్తి చేయాల్సి ఉన్నా నిర్లక్ష్య వైఖ‌రితో వేలాది మంది న‌గ‌ర పౌరులను ఇబ్బందికి గురి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

 

Post Midle

Tags: Unprogressive underground works

Post Midle

Leave A Reply

Your email address will not be published.