వడ్డీలకు సరిపోని రుణమాఫీ : వైఎస్ జగన్ 

Date:24/02/2018
ప్రకాశం ముచ్చట్లు:
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 96వ రోజుకు చేరుకుంది.  శనివారం ఉదయం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం హాజీస్పురం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. కనిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ఎద్దేవ చేశారు. ‘ఎన్నిక‌ల‌కు ముందు మ‌ద్యం గురించి ఏమ‌న్నారు? పిల్ల‌లు మ‌ద్యం తాగి చెడిపోతున్నార‌ని అన్నారు. బెల్టు షాపులు తొల‌గిస్తామ‌ని చెప్పారు.. గ్రామాల్లోనూ మ‌ద్యం దొరుకుతోంది… మంచి నీరు లేని గ్రామాలు ఉన్నాయేమోగానీ, మ‌ద్యం లేని గ్రామం మాత్రం లేదు. ఫోన్ చేస్తే చాలు, ఇంటికే మ‌ద్యం తీసుకొచ్చి ఇస్తున్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్ అన్నారు. కాంతంవారిపల్లి, చిన్న ఎర్లపాడు, పేరంగుంట, కొత్తపల్లి, చింతలపాలెం, శంఖవరం, టకారిపాలెంలో జగన్ పాదయాత్ర చేశారు. సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు నిన్న (శుక్రవారం) పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్ ఈరోజు తిరిగి యదావిధిగా పాదయాత్రను కొనసాగించారు.
చంద్రబాబు పాలన అంతా లంచాల మయంగా మారిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వందే పేదలకు ఏ పనీ జరగడం జగన్ అన్నారు… పింఛన్లు కావాలన్నా లంచాలే.. రేషన్ కార్డులు కావాలన్నా లంచాలే, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సమర్పించాల్సి రావడం చంద్రబాబు పాలనకే చెందిందన్నారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్ర దేశ్కు ప్రత్యేక హోదా రాకుండా ప్యాకేజీతో చంద్రబాబు సరిపెట్టారన్నారు. హోదాపై రోజుకో మాట మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
Tags: Unsafe loan for interest: YS Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *