కనిపించని సినీ గ్లామర్

Date:23/05/2019

ముంబై ముచ్చట్లు:

2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో సినీ గ్లామ‌ర్ ఏ మాత్రం ప‌ని చేయ‌లేదు. సినిమాలు వేరు రాజ‌కీయం వేరు అనే నానుడి స‌రిగ్గా సెట్ అయిన‌ట్టు కొంద‌రు సెల‌బ్రిటీలు నిరూపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ గాజువాక‌, భీమవ‌రం నుండి పోటీ చేయ‌గా ఆ రెండు స్థానాల‌లో ఆయ‌న వెనుకంజ‌లో ఉన్నారు. ఇక ప‌వన్ సోద‌రుడు నాగబాబు న‌ర‌సాపురం లోక్ స‌భ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌గా అక్క‌డ ఆయ‌న‌కి ఓటమి త‌ప్పేలా లేదు. ఇక ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వి విర‌ప్ర‌సాద్ విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేయ‌గా, ఆయ‌న ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. ఇక యంగ్ హీరోయిన్ మాధ‌వి లత బీజేపీ నుండి పోటీ చేయ‌గా ఆమె కూడా వెనుకంజ‌లోనే ఉంది. ఇక నార్త్ విష‌యానికి వ‌స్తే అల‌నాటి తార జ‌య‌ప్రద రాంపూర్ నుండి పోటీ చేయ‌గా, ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉంది. కాంగ్రెస్ త‌ర‌పున నార్త్ ముంబై నుండి పోటీ చేసిన ఊర్మిళ‌ని కూడా ఓట‌మి ప‌ల‌క‌రించేలా ఉంది.

 

 

 

 

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, పూన‌మ్ సిన్హా, మిమీ చ‌క్ర‌వ‌ర్తి కూడా వెనుకంజ‌లోనే ఉన్నారు. అయితే రోజా( న‌గ‌రి) , సుమ‌ల‌త‌( క‌ర్ణాట‌క‌) , హేమ‌మాల‌ని( మ‌ధుర‌, బీజేపీ), స‌న్నీ డియోల్ ( గురుదాస్ పూర్, బీజేపీ), స్మృతి ఇరానీ ( అమేథి, బీజేపీ), కిర్ర‌న్ కేర్ ( చండీఘర్, బీజేపీ) విజ‌య‌కేతనం ఎగుర‌వేయ‌నున్నారు.

 

సౌత్ లో లోకల్ పార్టీలే….

Tags: Unseen movie glamor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *