యాత్రలో కనిపించని జగన్

The life story of late Chief Minister YS Rajasekhara Reddy is being screened as a film titled Yatra.

The life story of late Chief Minister YS Rajasekhara Reddy is being screened as a film titled Yatra.

Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో పోచంపల్లిలో జరుగుతుంది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. వై.ఎస్.ఆర్ పాత్రధారి మమ్ముట్టి, సబిత ఇంద్రారెడ్డి పాత్రధారి సుహాసిని కొంత మంది వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.అలాగే ఓ పాటలో బ్యాగ్రౌండ్  స్కోర్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు వై.ఎస్.జగన్ పాత్రలో సూర్య లేదా కార్తి నటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యాత్ర చిత్రంలో వై.ఎస్.జగన్ పాత్ర ఉండదట. కృష్ణ కుమార్ సంగీతం, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది. మహి వి.రాఘవ్ దర్శకుడు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలు.
Tags:Unseen pics of the trip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *