ఫిబ్రవరి 3 న అన్ స్టాపబుల్…
హైదరాబాద్ ముచ్చట్లు:
అన్‌స్టాపబుల్ 2’లో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి ఎలా ఉంటుందో ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్, టీజర్ ద్వారా జనాలకు బాగా అర్థమైంది. ఇద్దరి మధ్య మాంచి ఫన్ ఉండబోతుందని తెలిసింది. అలాగే, పాలిటిక్స్ ప్రస్తావన కూడా ఉందని క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్‌లో ”నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి” అని బాలకృష్ణ అంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ఇక, ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్ విషయానికి వస్తే… తనను ‘బాల’ అని పిలవమని పవన్ కళ్యాణ్ అడగడం… అందుకు పవన్ ”నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ పిలవలేను” అని పవన్ అనడం వైరల్ అయ్యింది. అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే అంశాన్ని కూడా బాలకృష్ణ అడిగారు.
రెండు పార్టులుగా పవన్ ఎపిసోడ్!
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిడివి గంట కంటే ఎక్కువ వచ్చిందని ఆహా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కంటెంట్ బాగా రావడంతో రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట! ఇంతకు ముందు ప్రభాస్ ఎపిసోడ్ కూడా ఆ విధంగా విడుదల చేశారు’అన్‌స్టాపబుల్ 2′ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్టును ఫిబ్రవరి 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దానికి సంబంధించి ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ట్రైలర్ కూడా ఈ రోజే విడుదల చేయాలని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున జరిగింది. అప్పటికి ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి విడుదల కావడం ఖరారు అయ్యింది. ప్రభాస్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ ఫోనులో మాట్లాడినప్పుడు ‘ముందు నా సినిమా చూడు. ఆ తర్వాత మీ నాన్న సినిమా చూడు’ అని బాలకృష్ణ చెప్పారు. పవన్ సాధారణంగా సినిమాలు చూడరు. అందువల్ల, సంక్రాంతి సినిమాల గురించి చర్చ వచ్చిందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి!
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఏయే టాపిక్స్ గురించి ‘అన్‌స్టాపబుల్ 2’లో మాట్లాడారు? అని సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు… రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ కూడా! ఎందుకంటే… ఇటీవల తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదంటూ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు అమెరికాలో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘అన్‌స్టాపబుల్ 2’ ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది. విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్‌లోనే పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్ 2’కు వస్తారని ప్రేక్షకులకు అర్థమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫోన్ చేయగా… ‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?’ అని బాలకృష్ణ అడగటం, ‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్’ అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే. అప్పుడు బాలకృష్ణ ‘ఎవరితో రావాలో తెలుసుగా!?’ అని అడగటం వైరల్ అయ్యింది.
Tags: Unstoppable on February 3…
