నట్టేటముంచిన అకాల వర్షం
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గురువారం ఒకసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్ లో వేరుశెనగ పూర్తిగా తడిసి పోయింది. గద్వాల జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు వేరుశనగ కొట్టుకపోయింది. గద్వాల జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులు తీసుకోవచ్చిన వేరుశనగ అకాల వర్షానికి తడిచి అపార నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా మార్కెట్ యార్డ్ అధికారులు, పాలకులు స్పందించకపోవడం తో వారి నిర్లక్ష్యంతో పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అధికారులు సకాలంలో చర్యల తీసుకున్నట్లు అయితే వేరుశనగ నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పోయిన పంటకురాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
Tags; Untimely rain

