పుంగనూరులో పత్తాలేని రూ.1.36 కోట్లు స్వాహా కేసు

– పట్టించుకోని అధికారులు

పుంగనూరు ముచ్చట్లు:

 

మండల కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి సునిల్‌ రూ.1.36 కోట్లు స్వాహా చేసిన సంఘటనపై జెడ్పి సీఈవో, స్థానిక మండల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. స్థానిక మండల కార్యాలయంలో కంప్యూటర్‌ ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్‌ మండలానికి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు , జనరల్‌ నిధులు వెహోత్తం రూ.1.36 కోట్ల రూపాయలను తన బినామి ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. సంవత్సరం కాలంగా జరిగిన ఈ తంతంగం జరిగింది. ఎన్నికల ముందు దీనిని గుర్తించిన అధికారులు మిన్నకుండిపోయారు. కోట్ల రూపాయలు స్వాహాలో బాధ్యులైన అధికారులు రామనాథరెడ్డి, నారాయణ, ఏవో రాజేశ్వరి లకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి జెడ్పి సీఈవో గ్లోరియా చేతులు దులుపుకున్నారు. దీనిపై పోలీస్‌ కేసు నమోదు చేసేందుకు అధికారులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఉద్యోగుల నిర్లక్షం కారణంగా నిధులను బినామి ఖాతాలకు సునిల్‌ బదిలీ చేయడం వివాదస్పదమైంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Untraceable Rs 1.36 crore Swaha case in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *