Natyam ad

జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి ముచ్చట్లు:

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ను మంగ‌ళ‌వారం టీటీడీ ఛైర్మ‌న్   భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి పురంలో గ‌ల ఛైర్మ‌న్ నివాసంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ఆల‌యంలో మార్చి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో   ఎం.ర‌మేష్‌బాబు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Unveiling of Jubilee Hills Sri Venkateswara Swamy’s Brahmotsavam Mural

Post Midle