Natyam ad

మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయుల విగ్రహా విష్కరణ

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయుల విగ్రహా విష్కరణ.ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు  నవాజ్ బాషా,  చింతల రామచంద్రారెడ్డి,  ఆరణి శ్రీనివాసులు, టిటిడి బోర్డ్ సభ్యులు  పోకల అశోక్ కుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్  అడపా శేషు తదితరులుమంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తి కాదు.కృష్ణ జిల్లా అవనిగడ్డ లో అయన మూడు రోజులు ఉన్నట్టు ఆయన శిలాశాసనం ఉంది.అయన అనేక ప్రాంతాలను సందర్శించారు.అయన అన్ని ప్రాంతాలను, అందరినీ సమానంగా చూసారు.మన ప్రభుత్వం కూడా  వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం బేదం లేకుండా పాలిస్తున్నారు.

 

 

Post Midle

టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలు ద్వారా కావలసిన వారికి మాత్రమే పథకాలు అందించారు.ఈరోజు మదనపల్లి లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది.కుప్పం, పలమనేరు లో కూడా నేనే విగ్రహా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది.నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి బలిజ సోదరులు అండగా నిలిచారు.వారికి వీలైనంత సేవ చేసేందుకు కృషి చేస్తా.మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మా మద్దతు ఉంటుంది.

 

ఎంపి  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్…..

ఇంత మంచి కార్యక్రమం కు ఆహ్వానించినందుకు మదనపల్లి బలిజ సేవా సమితి కి ధన్యవాదాలు.దాదాపు 550 సంవత్సరాలు ముందు జన్మించి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు   కృష్ణదేవరాయలు.ఈ 500 సంవత్సరాల్లో ఎంతో మంది రాజులు వచ్చినా శ్రీ కృష్ణదేవరాయలును ఎవరు మర్చిపోలేదు.అయన చేసిన మంచి పనులే ఆయన్ని గుర్తు పెట్టుకునేలా చేశాయి.మదనపల్లి నడిబొడ్డులో కాదు, రాష్ట్రం, దేశం నడిబొడ్డులో కూడా అయన విగ్రహం పెట్టల్సిన అవసరం ఉంది.అనేక మంది పాలకులకు ఆయన పాలన స్ఫూర్తిదాయకం

  

Tags:Unveiling of the statue of Sri Krishna Devaraya organized by Madanapally Balija Seva Samiti

Post Midle