Natyam ad

కల్పవృక్ష వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ  ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో  వీరబ్రహ్మం ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.విభీషణ శర్మ పాల్గొన్నారు.’భారతీయ గణిత శాస్త్ర చరిత్ర 1 మరియు 2’అనే గ్రంథాలను డాక్టర్. రేమెళ్ళ అవధానులు ర‌చించారు. శంకర బాలకృష్ణ దీక్షిత్ మరాఠ భాషలో రాసిన భారతీయ గణిత శాస్త్ర చరిత్రను డాక్టర్ రేమల్లె అవధానులు తెలుగులో అనువదించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు, గ్రహణాలు, రాశి ఫలాలు, జననకాల లగ్నాలు, భవిష్యత్తును సూచించే సాముద్రికలు మొదలైనవి ఈ గ్రంథంలో వివరించారు.’శ్రీమాతా వైష్ణో దేవి మహత్యం’ అనే గ్రంథం  ఎంఎంవి.సుబ్రహ్మణ్యం రచించారు.జమ్మూలోని కాట్రా నగరంలో త్రికోట పర్వతంపై  సరస్వతీ, మహాలక్ష్మి,  పార్వతి కలిసి మాతా వైష్ణో దేవిగా వెలశారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భారతదేశంలోని క్షేత్ర మహత్యము తీర్థ ప్రాముఖ్యత తెలుస్తుంది.

 

Post Midle

Tags: Unveiling of three spiritual books at Kalpavriksha Vahanaseva

Post Midle

Leave A Reply

Your email address will not be published.