చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల  పోస్టర్లు ఆవిష్కరణ

Unveiling posters of the annual Brahmotsam of Sri Kodandarama Swami in Chandragiri

Unveiling posters of the annual Brahmotsam of Sri Kodandarama Swami in Chandragiri

Date:15/03/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్‌ 14వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. చంద్రగిరి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

 

 

 

 

 

 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీ ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం, ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 18వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 20వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

 

 

 

 

 

 

 

ఏప్రిల్‌ 23వ తేదీ ఉదయం 11.00 గంటలకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు.  రాత్రి 8.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ. ఏప్రిల్‌ 24వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం, ఏఈవో  శ్రీ నాగ‌రాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పదిలో ఫస్ట్ మనమే ఉండాలి

Tags:Unveiling posters of the annual Brahmotsam of Sri Kodandarama Swami in Chandragiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *